ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చూడాలి
- హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ
- ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలిన
హుజురాబాద్:
పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ సూచించారు. శనివారం హుజరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎన్నికల సహాయ అధికారి రమేష్ బాబు, పట్టణ సీఐ బొల్లం రమేష్ తో కలిసి పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం కట్టదిట్టమైన ఏర్పాటు చేయాలని సూచించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.
