
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచ కార్మిక దినోత్సవం 141వ మే డే వేడుకల సందర్భంగా శుక్రవారం హుజురాబాద్ లోని పలు ప్రాంతాల్లో కార్మికులు మే డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పోరాట ఫలితంగానే కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలు వచ్చాయన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం వారి పోరాటాన్ని స్మరించుకుంటూ మేడే వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ అని పలువురు వక్తలు అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘ నాయకులు, గ్రామపంచాయతీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, రైస్ మిల్లు వర్కర్స్, హమాలీ యూనియన్ నాయకులు, తదితరులు అరుణ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిపో జేఏసీ చైర్మన్ టి శివ దయాల్ సింగ్, సాగర్, ఏ వెంకటరాజం, సాధుల కిషోర్, కుడికాల అశోక్, రమేష్, బుచ్చయ్య, జి రమేష్, తాళ్లపెళ్లి శ్రీనివాస్, చక్రపాణి, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, శ్రీనివాస్, సిఐటియు మండల కన్వీనర్ కదిరే రమేష్, మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు రాచపల్లి సరోజన, బొరుగాల కుమారస్వామి, బొరుగాల ప్రమీల, రాజకుమార్, బొంకూరు కుమారస్వామి, రోంటాల సుధీర్, ప్రతాప రాజు, పి అనిల్ కుమార్, ఆరెల్లి రమేష్, హమాలీ సంఘం నాయకులు కొంకట చంద్రయ్య, రాచపల్లి సారయ్య, రాచపల్లి చంద్రయ్య, రాసపెళ్లి శంకర్, మాట్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


మున్సిపల్ కార్యాలయం వద్ద…


పోస్ట్ ఆఫీస్ వద్ద….





