Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కిషోర బాలికలు సెల్ఫోన్లకు, ఇతర వ్యాపకాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వారిని ప్రత్యేక శ్రద్ధతో చూడాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో స్నేహ కార్యక్రమంపై విఎల్ వో లకు, ఆశలకు అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. 18 సంవత్సరాల లోపు బాలికలు సెల్ఫోన్ వాడకానికి, ఇతర వ్యాపకాలకు తొందరగా ఆకర్షితులవుతారని అన్నారు. వీటికి దూరంగా ఉంచితే మంచిది అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం ఐబి కరుణాకర్, మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, చెల్పూర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, ఐకెపి ఎపిఎం లతా మంగేశ్వరి, సీసీలు బొరగాల శ్రీనివాస్, నరసింహచారి, పలువురు అంగన్వాడీ సూపర్వైజర్, టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏసిపి మాధవి

ఏసీపి మాధవితో మహిళలు…

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంఈఓ శ్రీనివాస్






