Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మిడిదొడ్డి శ్రీనివాస్ తండ్రి బొందయ్య మృతిచెందగా శుక్రవారం టిపిసిసి ప్రధాన కార్యదర్శి కాశపాక రాజేష్ ఆయన కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఒక కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడికి ఈ సంఘటన బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వారి కుటుంబం ఎంతో పార్టీకి ఎనలేని సేవలు చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అన్నాడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి యాళ్ల రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పోతారం భాస్కర్, ఇల్లందుల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

బొందయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి కాశపాక రాజేష్





