
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి పనుల వేగం పెంచాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో హుజురాబాద్ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలోని పలు మౌలిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రజా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. పేదలకు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు వెంటనే కేటాయించాలని, ఇళ్ల ఎంపికలో ఎమ్మెల్యేను కూడా భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేకపోవడం, మందుల కొరత తీవ్రంగా ఉండటంపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.మిషన్ భగీరథ అమృత్ పథకం కింద ఉన్న రూ.33 కోట్ల నిధులతో పనులు ఆలస్యం చేయకుండా, ఎమ్మెల్యే ప్రతినిధులతో సమన్వయం చేసుకుని వెంటనే ప్రారంభించాలని అన్నారు. హుజురాబాద్ క్యాంప్ లోని ఎంవిఐ ఆఫీస్, ఎంజెపి స్కూల్లకు నీటి కనెక్షన్, మోరి సదుపాయం లేదని వెంటనే సౌకర్యం కల్పించాలన్నారు. వీణవంక మండలంలోని మామిడాలపల్లి–కోర్కల్, నాగంపేట్, బూజునూర్ రోడ్ల మరమ్మతులు తక్షణమే ప్రారంభించాలని, కమలాపూర్ బస్టాండ్ మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఇల్లందకుంటలో మక్కల కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించి రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని, ఇల్లందకుంటలో ప్రారంభించిన రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద దేవాదాయ శాఖ అధికారులు ఇలా పలకడం ఏర్పాటు చేయాలన్నారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలకు మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే కెసిఆర్ కిట్టు పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని లేకుంటే పేరు మార్చి అయినా అమలు చేయాలని అన్నారు.

మాట్లాడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసినీ
—డంపింగ్ యార్డ్ ఏర్పాటు రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే, పంటలకు వ్యవసాయానికి కీడు చేసే హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా నేతన్న భద్రత పథకం కింద 5 కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున మొత్తం ₹25 లక్షలు అందజేశారు.
ఆర్థిక పునరావాస పథకం కింద 2 కుటుంబాలకు ఒక్కొక్కరికి 75 వేల రూపాయల చొప్పున మొత్తం 1.50 లక్షలు అందజేశారు.7 మంది అనాథ పిల్లలకు అనాథ సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమేష్ బాబు, మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని, ఎంపీడీవో తూర్పాటి సునీత, తాసిల్దార్ జక్కని నరేందర్ తదితర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశంకు హాజరైన డివిజన్లోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు..


పలువురి సాధక బాధకాలు వింటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు..





