
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయం పట్ల సోమవారం రాత్రి హుజురాబాద్ బిజెపి నాయకులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ … ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి, పనితీరుకు నిదర్శనంగా నిలిచాయని అన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ , అస్సాం , పుదుచ్చేరిలో చరిత్ర తిరగరాసే విధంగా విజయం సాధించిందన్నారు. పశ్చిమబెంగాల్ లో బిజెపి గెలుపు జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మండల అధ్యక్షులు తూర్పాటి రాజు, పారుపల్లి కొండల్ రెడ్డి, సర్పంచ్ ముప్పు మహేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, కౌన్సిలర్ లక్ష్మీదుర్గ, మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ళ వెంకటరెడ్డి, మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.


పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు జరుపుకుంటున్న జిల్లా అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు..


అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి నేతల సంబరాలు





