Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : నైపుణ్యం గల తమ ఇంజనీరింగ్ విద్యార్థులకు అపార ఉపాధి అవకాశాలు ఉన్నాయని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకర్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ – “సక్సెస్ హడుల్” జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు విభాగాల్లో చివరి సంవత్సరం విద్యార్థులు దాదాపు 360 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు సాధించారన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు టిసియస్, ఇన్ఫోసిస్, టాటా ఎలక్ట్రానిక్స్, బ్రెనోవిజన్, డెలాయిట్, ఏపిటి ఆన్లైన్ వంటి కంపెనీలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారన్నారు. కళాశాల ట్రెజరర్ వి.ఇంద్రనీల్ మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతోపాటు ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలను అలవర్చుకోవాలన్నారు. ట్రేనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారిని డాక్టర్ కే విజయలక్ష్మి మాట్లాడుతూ…. విద్యార్థికి తృతీయ సంవత్సరము నుంచి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంబంధించిన శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ద్వారా కమ్యూనికేషన్స్ స్కిల్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కంప్యూటర్ కోడింగ్ మొదలగు శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణకు ప్రత్యేక శిక్షకులను నియమిస్తామన్నారు. ఉద్యోగాలు పొందిన పలువురు విద్యార్థులు మాట్లాడుతూ… కళాశాలలో చదువు పూర్తి కాకముందే ఉద్యోగాలు రావడం సంతోషమన్నారు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నైపుణ్యం అవసరం ఉంటుందని విద్యార్థులు తాము అనుకున్న కంపెనీలో ఉద్యోగం రావాలంటే తగిన విధంగా శిక్షణ తీసుకోవాలన్నారు. ఉద్యోగం పొందిన విద్యార్థులు ట్రేనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగమునకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్లు యన్.రఘు, స్రుజన, అభిషేకర్ రెడ్డి, మనోజ్ సుభద్ర, వంశీ, బాల భాస్కర్ లు పాల్గొన్నారు.

వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులతో కిట్స్ ప్రిన్సిపల్, అధ్యాపకులు…





