
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయం దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసానికి నిదర్శనమని బీజేపీ నాయకులు మట్ట పవన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలనకు మద్దతు తెలుపుతూ ఎన్డీఏకు ఘన విజయం అందించారని అన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో వచ్చిన ఫలితాలు ప్రజల్లో మార్పు కోసం ఉన్న ఆశలను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక ఇదే తరహాలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కమలం వికసించబోతుందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ విధానాలు, ప్రధాని నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం రోజు రోజుకూ పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు ప్రారంభమైంది తెలంగాణలో కమలం వికసించడం ఖాయం అని తెలిపారు. తెలంగాణలో కూడా కమలం వికసించడం ఆపలేరు, ఇది ప్రజల సంకల్పము ఇది భవిష్యత్ దిశ అని మట్ట పవన్ రెడ్డి అన్నారు. ప్రధాని నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతుందని, అదే అభివృద్ధిని తెలంగాణలో కూడా తీసుకురావడం బీజేపీ లక్ష్యమని తెలిపారు.





