
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నేటి బాలలే రేపటి దేశ గౌరవాన్ని పెంచే యువకులని అలాంటి వారి సమగ్రాభివృద్ధికి విద్య అవసరమని, విద్యాభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని విఎల్ఆర్ ఫంక్షన హాల్లో ప్రజా పాలన విద్యా వారోత్సవాలను పురస్కరించుకొని ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు జరిగింది.

ఈ సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఏ ప్రభుత్వమైనా విద్యపై ఖర్చును ఖర్చుగా చూడరాదని అది రేపటి భవిష్యత్తుకు పెట్టుబడి అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యాభివృద్ధి కోసం నిధులు ఎక్కువగా ఖర్చు చేశరని అన్నారు. అట్టడుగు వర్గాల పిల్లల విద్యాభివృద్ధి కోసం గురుకులాలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరిపై లక్షలాది రూపాయలను ఖర్చు చేశారన్నారు. అనేక పథకాలను ప్రవేశపెట్టి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిందని అన్నారు. నేటి ప్రభుత్వం కూడా విద్యాభివృద్ధి కోసం నిధులు పెంచి కృషి చేయాలని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో గానే పిల్లలకు పుస్తకాలు డ్రెస్సులు ఇతర వస్తువులు అందే విధంగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇచ్చే కోచింగ్ వారు ఉపయోగించుకోవాలన్నారు.

హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ…ఒక బాలుడు చదివితే వ్యక్తి మాత్రమే ఎదుగుతాడు అదే ఒక బాలిక చదివితే కుటుంబం ఎదుగుతుందని అన్నారు. పుస్తకం పట్టిన వాడు చరిత్ర సృష్టిస్తాడు పుస్తకం వదిలేసిన వాడు చరిత్రను వింటూ ఉండిపోతాడనీ అన్నారు. సిడిపిఓ సుగుణ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రజాప్రతినిధుల సహకారం అవసరమన్నారు. హుజురాబాద్ ఎంఈఓ పిడప్ శ్రీనివాస్ మాట్లాడుతూ… పిల్లల విద్యాభివృద్ధి కోసం రెమెడియన్ క్లాసులను ఉపయోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుగుణ, ఎంపీడీవో టి సునీత, జమ్మికుంట ఎంఈఓ హేమలత, ఇల్లంతకుంట రాములు, వీణవంక శోభరాణి, ఏఎంఓ అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచులు, కౌన్సిలర్స్ పాల్గొన్నారు. కాగా సదస్సుకు హాజరు కావలసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు నామమాత్రంగా హాజరు కావడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

హాజరైన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు..





