
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్ ప్రధాన రహదారిపై సబ్ స్టేషన్ ఎదురుగా గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. వివరాలలోకి వెళితే… హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామానికి చెందిన నీరటి సదానందం, రమేష్ లు బైక్ పై ప్రయాణిస్తుండగా ఎదురెదురుగా వస్తున్న కారు బైక్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలు కాగా వెంటనే వారిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనలో సదానందంకు తీవ్ర గాయాలు, రమేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా సదానందం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇరువురు పనిమీద హుజురాబాద్ కు ద్విచక్ర వాహనంపై వచ్చి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన నీరటి సదానందం..

గాయపడిన రమేష్





