
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 20: హుజురాబాద్ లోని
మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో దోస్తు రెండో విడతకు అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు కళాశాల చైర్మన్ కాయిత ఇంద్రసేనారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కొండ్లె నరసింహారెడ్డి, ప్రిన్సిపాల్ వల్లూరి రామారావు గురువారం తెలిపారు.
బిఎస్సి, బీకాం, బి ఏ(జర్నలిజం) కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. హుజురాబాద్ డివిజన్ లోని గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు ప్రవేశం పొంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.





