
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 41 అంశాలను ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించారు. పలు అభివృద్ధి పనులకు రూ. నాలుగు కోట్ల నిధులను కేటాయించారు. కాగా 1.50 కోట్ల రూపాయలతో మున్సిపల్ కార్యాలయం పైన నూతన కౌన్సిల్ హాలు నిర్మాణం, 2.50 కోట్ల రూపాయలతో 30 వార్డుల్లోని పలు అభివృద్ధి పనులకు చేపట్టడానికి ప్రతిపాదనలు, సాధారణ నిధుల నుండి 5 లక్షల రూపాయలతో ప్రధాన రహదారుల మధ్యన గల సెంట్రల్ మేడియన్లలోని విద్యుత్ దీపాలు రిపేరుకు, బక్రీదు ఏర్పాట్లకు రెండు లక్షల రూపాయలు, సాధారణ నిధుల నుండి దోమల నివారణ 1,49,000 రూపాయలతో నూతనముగా రెండు ఫాగింగ్ మెషిన్లు కొనుగోలు చేయుటకు, పట్టణములో మంచి నీటి సరఫరా చేయు జోన్ –I , జోన్ –II ట్రంక్ మెయిన్ తరుచుగా లీకేజీ అగుచున్నందున 15వ ఆర్ధిక సంఘం నిధుల రూ. 5,00,000/-లతో ఎయిర్ వాల్స్ బిగించి లీకేజీ అరికట్టుటకు నిధులు కేటాయించాలని తీర్మానం చేశారు.


ఈ సమావేశంలో పురపాలక వైస్-చైర్ పర్సన్ గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కమిషనర్ బి కిషన్, మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్, టెక్నికల్ అధికారి నరేష్, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ అశ్వినీ గాంధీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఐ రమేష్, జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, వ్యవస్థాపన విభాగాధికారి పి శంకర్ బాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.





