
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, మే 27: ఐపీఎల్-2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన RR జట్టు 253 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 97 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలమైన ఆధిక్యం అందించాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన SRH ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. మ్యాచ్ మొత్తం రాజస్థాన్ ఆధిపత్యంలో సాగగా.. చివరికి RR విజయం సాధించి తదుపరి దశకు చేరుకుంది. ఈ ఓటమితో సన్రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.





