
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యువకుల్లో దేహదారుఢ్యం పెరగడానికి ఉపయోగపడే ” పుల్లప్ బార్ ” ను ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కొన్ని రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రాంతం క్రీడలకు క్రీడాకారులకు పేరోoదిoదని అన్నారు. వారికోసం తమ సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన చింతకింది శ్రీనివాసరెడ్డి, ఎండి మతిన్ లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే హరిప్రసాద్, వాకర్స్ సభ్యులు వేల్పుల రత్నం, పలకల ఈశ్వర్ రెడ్డి, పాక సతీష్, తాళ్ల పెళ్లి రమేష్ గౌడ్, ఐలయ్య, ఉప్పు శ్రీనివాస్ పటేల్, రాజు, సాయికృష్ణ, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.





