Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీల సెలవులు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటం, తీవ్రంగా వడగాల్పులు వీస్తుండటంతో వేసవి సెలవులను పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. జూన్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ వర్సిటీలు జూన్ 6 వరకు సెలవులను పొడిగిస్తూ అధికారిక సర్క్యులర్ జారీ చేశాయి. కాకతీయ, శాతవాహన వర్సిటీలు జూన్ 5వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగించాయి.




