
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణ కోసం బలిదానాలు చేసిన అమర వీరులందరికి ప్రజా సంఘాల తరపున అంజలి ఘటిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
కరీంనగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పోలాడి రామారావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మార్కెట్ రోడ్డులోని ఆమరవీరుల స్తూపం వద్ద నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎల్ ఎండి మానేరు డాం కట్టపైన ఉమ్మడి జిల్లా రైతు సంఘాల ప్రతి నిధులతో కలిసి ఉద్యమ కారులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ ప్రాంతాలు విడి పోయినా తెలుగు జాతి ఒక్కటేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రజా సంఘాల తరపున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు. ఎందరో త్యాగధనుల పోరాటాలు చిరస్మనీయం అన్నారు. ప్రొఫెసర్ కోదండ రాం అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీలతో ఏర్పడిన జేఏసీతో సహా కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థులు, యువతీ యువకుల, సకల జనుల పోరాటాల ఫలితంగా స్వరాష్ట్ర తెలంగాణ సిద్ధించ్చిందని ముఖ్యంగా తెలంగాణ తొలి సీఎం కెసిఆర్ పాత్ర అమోఘం అని కొనియాడారు.
అప్పటి యుపిఏ చైర్ పర్సన్ సోనియా, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ల కీలక నిర్ణయంతో బీజేపీ పక్ష నేత సుష్మా స్వరాజ్ ల మద్దతుతో నూతన 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్ట రూపం దాల్చి 2014, జూన్ 2వ తేదీన అమల్లోకి వచ్చిందని పోలాడి రామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో అమరులైన వారి కుటుంబాలను ఆదుకొని పోరాటాల్లో పాల్గొన్న యోధులందరికి, వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయ సహకారం అందించాలని పోలాడి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని, రైతు భరోసా నిధులను పంటల సాగు సమయంలోనే మొత్తం విడుదల చేయాలని, అన్ని పంటలకు బోనస్ నిధులను పంట కొనుగోళ్ళ డబ్బులతో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండాఎరువులను సకాలంలో పంపిణీ చేయాలన్నారు. దాన్యపు కొనుగోళ్లను వారంలోగా పూర్తి చేయాలని రామారావు డిమాండ్ చేశారు.

ఉమ్మడి జిల్లా రైతు సంఘాల ప్రతి నిధులతో కలిసి ఉద్యమ కారులతో ఆత్మీయ సమావేశమూలో మాట్లాడుతున్న ఓసి జెసి జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.





