
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎక్కటీ సంజీవరెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎక్కటీ సంజీవరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యాకారుల పోరాట ఫలితంగా, అమవీరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు. ఈ సందర్భంగా యావత్తు ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.





