
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో కన్నెబోయిన మహేందర్ యాదవ్ కు చెందిన ఆయిల్ ఫామ్ తోట దగ్ధమైంది. తోట పక్కన పొలం కొయ్య కాలు పక్క రైతు కోయకాల కాలుస్తుంటే ఆయిల్ పామ్ చెట్లు 45 కాలిపోవడం జరిగింది. 100 ల ఎకరాలు తగలబడి పోతుంటే ఏ రైతుకు అవగాహన రాకపోవడం నాకేం కాకుంటే పక్క రైతు ఏమైపోయినా కూడా నాకేంటి అనుకుంటున్నారు అని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నష్టం జరుగుతుంటే ఆ రైతులకు కనీసం అవగాహన రాకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతులకు కొయ్య కాళ్లు తగలబెట్టే విషయంలో చైతన్య పరచాలని మహేందర్ సూచిస్తున్నారు.






పక్కన రైతు కొయ్యకలు తగలబెట్టడంతో ఆయిల్ ఫామ్ తోటలు దగ్ధమైన దృశ్యంలు…





