Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానoలో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జెసిబితో అక్రమంగా చదును చేశారు. కాగా మరుసటి రోజు చదును చేస్తుండగా కళాశాల సిబ్బంది గమనించి ఎవరు మీరు, మైదానాన్ని ఎందుకు చదును చేస్తున్నారు అని గద్దించడంతో తప్పించుకొని వెళ్లిపోయారు. దీంతో కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయరావు పోలీసులకు, తాసిల్దార్ కు, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం నేరమని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు సైతo ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.





