Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
2025 మార్చి నెలలో భారతీరాజా కుమారుడు మనోజ్ కేవలం 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అకాల మరణం చెందారు. కొడుకు మరణించినప్పటి నుండి భారతీరాజా ఆరోగ్యం బాగా క్షీణించింది.
అంత వయసులో పుత్రశోకాన్ని ఆయన అస్సలు తట్టుకోలేకపోయారు. మనోజ్ అంత్యక్రియల సమయంలో భారతీరాజా తీవ్రమైన ఆవేదనతో కుంగిపోయిన దృశ్యాలు అందరినీ కన్నీరు పెట్టించాయి. కొడుకు దూరమైన బాధ నుండి భారతీరాజా ఇప్పటికీ కోలుకోలేకపోయారని, ఆయన మానసిక స్థితి చాలా బలహీనంగా మారిపోయిందని ఇటీవల ఆయన సోదరుడు జయరాజ్ కూడా మీడియాకు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో భారతీరాజా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో చెన్నై టి.నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పట్లో ఆయన శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసంతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (85) ఇక లేరు..




