
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ శివారులో అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు టౌన్ సిఐ బొల్లం రమేష్ ఆధ్వర్యంలో ఎస్సై సాంబయ్య గౌడ్ సిబ్బందితో దాడి చేసి 27 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. గ్రామ శివారులో తరలించేందుకు సిద్ధంగా ఉన్న అశోక్ లేలాండ్ గూడ్స్ టీఎస్ 0 3 యు డి0406 లో 27 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కందువులకు చెందిన భత్తుల ఆకయ్య, గంటా అనిల్, నర్ర ఆవుల అనిల్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ ముగ్గురు గ్రామాలలో పిడిఎస్ రైసును ప్రజల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి అనంతసాగర్ లోని కోళ్ల ఫారాలకు తరలిస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసిన, తరలించిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.







