
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏండి సలీం గురువారం హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానం చేసి హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు సమస్యల మీద మాట్లాడారు. అందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సానుకూలంగా స్పందించి హై కమాండ్ తో మాట్లాడి పలు సమస్యలపై దృష్టి సారిస్తానని మాటిచ్చారని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి సలీం విలేకరులకు తెలిపారు.