
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ చేనేత సహకార సంఘంకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఎన్నికల అధికారి కె అశోక్ కుమార్ సూచించారు. బుధవారం నూతనంగా ఎన్నికైన కార్యవర్గముతో మొదటి సమావేశ కార్యక్రమం, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యులకు ఏర్పాటు చేసిన అభినందన సభకు ఎలక్షన్ అధికారి కె అశోక్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

సంఘం అభివృద్ధిలో కొనసాగాలని, సభ్యులకు అన్ని విధాల మేలు చేసేలా నూతన కార్యవర్గం పనిచేయాలని కోరారు. నూతన పాలకవర్గం కు అభినందనలు తెలియజేశారు. కొత్తగా ఎన్నికైన వారిని పూలమాల మరియు టవల్స్ చే సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఎలిగేటి ఉపేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మూడోసారి అవకాశం కల్పించిన సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను అంకితభావంతో నెరవేరుస్తానని సంఘం అభివృద్ధికి కృషి చేస్తారని ఈ సందర్భంగా అధ్యక్షుడు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఉపాధ్యక్షులు తాటిపాముల తిరుపతి, కార్యవర్గ సభ్యులు గుండేటి మహాదేవ్, ఆరుగొండ సమ్మరాజు, పత్తిపాక తిరుపతి, కోమటి సదానందం, శ్రీమతి కొక్కుల రాజమణి, శ్రీమతి బూర్ల తిరుపతమ్మలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ నేత పారిశ్రామికులు, కుల బాంధవులు, సంఘము సిబ్బంది పాల్గొన్నారు.

హాజరైన సంఘ సభ్యులు, కుల పెద్దలు..





