Oplus_16908288
—ఎల్కపెల్లి శ్రావణ్‌కు రూ.12 వేల ఆర్థిక సాయం అందజేత
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమ చిన్న నాటి 10వ తరగతి పూర్వ విద్యార్థి ఎల్కపెల్లి శ్రావణ్‌కు అతని మిత్రులు ఆర్థికంగా చేయూతనందించారు. శ్రావణ్‌ను స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మిత్రులు, ధైర్యంగా ఉండాలని సూచిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా 10వ తరగతి మిత్రులందరూ కలిసి విరాళాలు సేకరించి మొత్తం రూ.12 వేల నగదును శ్రావణ్‌కు అందజేశారు. ఆపదలో మిత్రుడికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైతే తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 10వ తరగతి సహపాఠులు పాల్గొని, శ్రావణ్ త్వరగా కోలుకుని మామూలు జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలకుంట ఎల్లయ్య, మిడిదొడ్డి రాజు, బొడ్డు అనిల్, ఏడుకొండాల్, శ్రావణ్, సురేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.





