Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు ఎవరైనా విధుల పట్ల బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినా, విధులను నిర్లక్ష్యం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డిసిహెచ్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన సందర్శించి వైద్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్యుల పనితీరును, రోగులపట్ల వారు ప్రవర్తిస్తున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల ఎవరు బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన డాక్టర్ రమేష్ కు షోకాజు ఇచ్చినట్లు తెలిపారు. నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తానని చెప్పారు. అయితే ఆస్పత్రిలో సీనియర్ జూనియర్ అనే విభేదాలు తలెత్తడంతోనే గందరగోళానికి కారణమని భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.

ఏరియా ఆసుపత్రిలో విచారణ జరుగుతున్న డిసిహెచ్ డాక్టర్ కృష్ణ ప్రసాద్..





