
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు అ వార్డులో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులకు రెండు వేల రూపాయల చొప్పున తన సొంత డబ్బులను తన అనుచరుల ద్వారా విద్యార్థులకు శనివారం అందజేశారు. తన వార్డు పరిధిలో పేద విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడకూడదని పుస్తకాలు బుక్కుల కొనుగోలుకు ఉపయోగపడేందుకై తనవంతుగా రవీందర్ రావు ఈ ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రవీందర్ రావు అమెరికాలో ఉన్నందున తన ప్రధాన అనుచరులైన మేకల ప్రభాకర్ రెడ్డి, గునిగంటి శ్రీనివాస్ ల ద్వారా ఇట్టి నగదును విద్యార్థిని విద్యార్థులకు స్వయంగా ఇల్లు తిరిగి వారు రవీందర్ రావు పేరుతో అందజేశారు. కౌన్సిలర్ రవీందర్ రావు తమ పిల్లలకు నగదు ప్రోత్సాహాన్ని అందించేందుకు ముందుకు రావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు రవీందర్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు. రవీందర్ రావు కౌన్సిలర్ గానే కాకుండా సామాజిక కార్యకర్తగా పేద విద్యార్థుల ఇబ్బందుల పట్ల స్పందించి తను స్వయంగా లేకపోయినా ఆర్థిక సాయం తన అనుచరుల ద్వారా అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శమని పలువురు కొనియాడారు.

12వ వార్డులోని ముక్కపల్లిలో గల పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తున్న రవీందర్ రావు ముఖ్య అనుచరులు..





