
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహా జననేత, మాదిగల సూర్యుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టిన రోజు మరియు ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్త దగ్గర ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం ఎమ్మార్పీఎస్ ను మందకృష్ణ మాదిగ స్థాపించి అలుపెరుగని పోరాటం చేసి విజయాన్ని సాధించి షెడ్యూలు కులాల ప్రజలకు సమాన వాటా కల్పించాలని గుర్తు చేశారు. ఈరోజు కృష్ణ మాదిగ పుట్టిన రోజు మరియు ఎమ్మార్పీఎస్ 32 వ ఆవిర్భావం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రుద్రారపు రామచంద్రం, రాష్ట్ర నాయకుడు మారేపల్లి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, MEF జిల్లా కార్యదర్శి డాక్టర్ తడికమళ్ళ శేఖర్, వేల్పుల రత్నం, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మొలుగూరి అశోక్, కార్యదర్శి రొంటాల రాజ్ కుమార్, రామ్ రాజేశ్వర్, వేల్పుల ప్రభాకర్, మేకల మల్లేష్, గడప రాజు, బత్తుల రాజలింగం, మాడుగుల ఓదెలు, రొంటాల శంకర్, ఎర్రోళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు.





