
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిన్న ప్రకటించిన శాతవాహన విశ్వవిద్యాలయం డిగ్రీ ద్వితీయ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో హుజురాబాద్‌లోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు (GPA) సాధించారన్నారు.

B.Com (CA)లో ఐలబోయిన పూజిత – 9.80 GPA,
జి. వైష్ణవి – 8.64 GPA, టి . వైష్ణవి – 8.44 GPA, టి స్వేత – 8.08 GPA, B.Sc (MPCS) లో
మహమ్మద్ సబానాజ్ – 9.28 GPA, జె. కల్యాణి – 7.76 GPA, ఎం. మౌనిక – 7.28 GPA,
B.Sc (BZC) లో పి. అమృతవర్షిణి – 8.68 GPA,
ఎ. సిరి – 8.32 GPA, ఎ. అశ్విత – 8.12 GPA,
బి. సాయి రేవతి – 8.08 GPA, టి పావళిక – 7.80 GPA సాధించారన్నారు.

ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే మా కళాశాల లక్ష్యం అన్నారు. విద్యార్థులు సాధించిన ఈ అద్భుత ఫలితాలు వారి కృషికి, అధ్యాపకుల అంకితభావానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని యూనివర్సిటీ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.” అని అన్నారు.
ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, “విద్యార్థుల క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం మరియు అధ్యాపకుల సమిష్టి కృషి వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి అన్నారు. రాబోయే సెమిస్టర్లలో కూడా ఇదే స్థాయి ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు సూచించారు.” అని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరెస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ బొక్కల ప్రవీణ్ రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కొలిపాక రమేష్, రామరాపు భద్రయ్య, మేకల నవీన్ కుమార్, తెలికుంట్ల వేణు, చందా వెంకటేష్, బోరాగాల సంపత్, వేముల శ్రీనివాస్, సురేష్, స్వప్న, ప్రియాంక, శివాని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.





