
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్
బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు సోమవారం హుజూరాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరీంనగర్ రోడ్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప ప్రధానిగా దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని, కౌన్సిలర్లు బండ సింధుజ, సొల్లు సునీత, ఇల్లందుల సమ్మయ్య, బోరగాల మొగిలి, నాయకులు రుద్రారపు రామచంద్రం, వేల్పుల రత్నం, మారేపల్లి శ్రీనివాస్, ముక్కెర రాజు, సొల్లు బాబు, కొండ్ర నరేష్, సందమల్ల బాబు, దుబాసి బాబు, వేల్పుల ప్రభాకర్, మట్టెడ ప్రకాష్, బత్తుల రాజలింగం, రామ్ రాజేశ్వర్, మల్లయ్య పంతులు, కుమార్, ప్రభాకర్ రెడ్డి, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు..






