
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మొక్కలు పర్యావరణానికి కీలకమని, విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని హుజురాబాద్ ఆర్డిఓ జల కుమారి పిలుపు నిచ్చారు. సోమవారం హుజురాబాద్ పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్ లో గల మైదాన ప్రాంతంలో, సైదాపూర్ రోడ్డు లని శివాజీ విగ్రహం సమీపంలో హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ…వర్షాలు సమృద్ధిగా కురువాలన్న, స్వచ్ఛమైన గాలి పీల్చాలన్న.. పచ్చదనం కోసం మొక్కలు నాటాలని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని మాట్లాడుతూ…. హరితహారంతో పచ్చదనం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద వీలును బట్టి మొక్కలను నాటి కాపాడాలన్నారు. అడవుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హరిత తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. హరితహారం కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించడంలో పాత్రులు కావాలన్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారిని బుర్ర లత మాట్లాడుతూ…. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలన్నారు. మొక్కలు నాటడమే కాక వాటిని ఎదిగేంత వరకు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.కిషన్, కౌన్సిలర్లు గోస్కుల రాజ్ కుమార్, వెంకట్ నాయక్, బోరగాల మొగిలి, తాళ్లపల్లి రమేష్ గౌడ్, వెంకటేశ్వర్లు, నాంపల్లి శ్రీనివాస్, సొల్లు సునీత, నాయకులు సందమల్ల బాబు, మేనేజర్ భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వినయ్, ఆయా వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




హరితహారంలో మొక్కలు నాటుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కమిషనర్ కిషన్, కౌన్సిలర్లు..





