Oplus_16908288
—మోసగించి భూమినీ కాజేసిన మనుమల నుంచి తిరిగి భూమి ఇప్పించాలని ఆర్డీవో ను వేడుకున్నా వృద్ధులు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జులై 6: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించని ఓ కొడుకు, మనుమలపై ఆర్డీఓ కు వృద్ధాప్యం, పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు సోమవారం ఫిర్యాదు చేయడం పలువురిని కలచివేసింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రెక్కలు ముక్కలు చేసుకొని సాది పెద్ద చేసిన తల్లిదండ్రులను కన్న కొడుకు, వారి వారసులైనా మనుమలు పట్టించుకోక పోగా తండ్రి లేడని మనుమలను సాది, పెద్ద చేసి అప్పులు చేసి మరీ ఉన్నత చదువులు చదివించి అప్పుల పాలైన ఆ వృద్ధులను సాధకపోగా వారి పేరున ఉన్న విలువైన భూమిని కాజేసి నిర్లక్ష్యంగా వదిలివేసి మోసం చేసిన మనుమలు వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరం.

అంతేగాక వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని కొనుగోలు చేసిన భూమిని మోసగించి నామిని అయిన తాతకు తెలియకుండా ఆ భూమి ముగ్గురు మనుమలు కాజేశారని, మనుమల నుంచి తిరిగి తన భూమి తనకు ఇప్పించాలని ఆర్డీవో ను ఆ వృద్ధులు వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ముషం వీరమల్లు, అతని భార్య ముషం బుచ్చి మల్లమ్మలు అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ ఆర్డిఓ కార్యాలయానికి చేరుకొని తమ గోడును వెళ్లబోసుకున్నారు.
వృద్ధాప్యంలో కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, మోసగించి ఆస్తిని లాక్కోవడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ, మన దేశంలో వృద్ధుల రక్షణ కోసం “తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ, సంక్షేమ చట్టం – 2007” (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) ఉంది అన్నది వారు మరిచారు. ఈ చట్టం ప్రకారం బాధితులైన వృద్ధులు ఆర్డీఓ (RDO – Revenue Divisional Officer) కు ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చునన్న ఆశతో వారు ఆర్డిఓను కలిసేందుకు వచ్చామన్నారు.
-తాతకు తెలియకుండా భూమిని రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న మనుమలు.. ఆస్తిని తిరిగి (సెక్షన్ 23) అప్పగించాలని వేడుకలు:
వృద్ధుల సంరక్షణ చూసుకుంటారనే నమ్మకంతో కొన్నేళ్ల క్రితం ఈ వృద్ధ దంపతులు వీరమల్లు, బుచ్చి మల్లమ్మలు రాంపూర్ గ్రామానికి సమీపంలో ఉండే జమ్మికుంట ప్రధాన రహదారికి రెండవ బిట్టు సర్వే నెంబర్ 170/బి లో 322.43 చదరపు గజాల ఫ్లాట్ ను కొనుగోలు చేసి ముషం వీరమల్లు(తాత) నామినిగా ఉండి కొడుకు(చిన్న కొడుకు చనిపోగా) కొడుకులు అయినా మనవళ్ళు ముగ్గురు ముషం ప్రదీప్, అరవింద్, ప్రశాంత్ పేరిట ఆస్తిని (భూమిని) రిజిస్ట్రేషన్ చేశామన్నారు. కానీ ఆ ముగ్గురు తాతకు తెలవకుండా కొన్ని నెలల క్రితం రీ రిజిస్ట్రేషన్ ముగ్గురి పేరున మార్చి చేసుకున్నారని వీరమల్లు పేర్కొన్నారు. అయినా ఆ ఒరిజినల్ భూమి పట్టా కాగితాలు తన వద్దే ఉన్నాయన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా వారు తాత, నానమ్మలను పట్టించుకోవడం లేదన్నారు. చిన్న మనవడు ముషం ప్రశాంత్ ను చదివించేందుకు రూ. 6,39,000 అప్పులు చేసి ఉన్నత చదువులు చదివించగా ప్రస్తుతం ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా కొనసాగుతూ ప్రశాంత్ తమను ఏనాడు పట్టించుకోవడం లేదన్నారు. తమకు తెలియకుండానే ముగ్గురు మనుమలు దొంగతనముగా రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ భూమిని తిరిగి తన పేరున మార్చాలని వీరమల్లు ఆర్డిఓ కు విజ్ఞప్తి చేశారు.
ఆ ఆస్తి బదిలీని చెల్లనిదిగా (Void) ప్రకటించే అధికారం ఆర్డీఓ (ట్రిబ్యునల్)కు ఉంటుంది కనుక మోసగించి రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని తిరిగి వృద్ధుల పేరిట మార్చాలని ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రశాంత్ చదువులకు చేసిన అప్పులను రూ. 6,39,000 తిరిగి చెల్లించేలా చూడాలని, నెలవారీ భరణం (పోషణ ఖర్చులు) తల్లిదండ్రులను సంరక్షించని కొడుకు, సంపాదన కలిగిన మనవళ్ల నుంచి వృద్ధులకు నెలవారీ పోషణ ఖర్చులు (గరిష్టంగా రూ. 10,000 లేదా కోర్టు ఆదేశాల ప్రకారం) ఇప్పించేలా ఆర్డీఓ ఆదేశాలు జారీ చేయాలని వారు ఆర్డిఓ కు ఇచ్చిన వినతి పత్రంలో వేడుకున్నారు.





