
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జూలై 06: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చేల్పూర్ గ్రామంలోని అతి పురాతన శివాలయం పునర్ ప్రతిష్ట వేడుకలో భాగంగా ద్వారం ప్రతిష్టాపన వేడుకలు సోమవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రధాన పూజారి ఉదయమర్రి కృష్ణమూర్తిశర్మ, ఆలయ పూజారి బస్మాంగి శంకరయ్య, బస్మాంగి సాత్విక్ ల వేదమంత్రోచరణల మధ్య శివాలయం ద్వారం ప్రతిష్టాపన వేడుకలు గావించారు. గ్రామ ప్రధాన పౌరోహితుడు ఉదయమర్రి కృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ దాతల భక్తుల సహకారంతో నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభించగా మరో 15 రోజుల్లో అంతరాలయం గర్భగుడి నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. గ్రామ ప్రజలతోపాటు మండల ప్రజలు, దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ద్వార ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొన్న భక్తులకు పూజారులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులైన వారిని పూజారులు దీవించి పంపించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ద్వారం ప్రతిష్టాపనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న గ్రామ ప్రధాన పూజారి ఉదయమర్రి కృష్ణమూర్తిశర్మ








