

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హుజురాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి క్రాస్‌రోడ్‌లోని బిరన్న దేవాలయంలో బిరన్న కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా శుక్రవారం ఉత్సవ కమిటీ కన్నుల పండువగా శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, నెయ్యి కార్యక్రమంను హుజురాబాద్ లోని ఎల్లమ్మ దేవాలయం, దుర్గమ్మ దేవాలయం, సమ్మక్క దేవాలయం, శివాలయం, రామాలయంలలో పాలు, నెయ్యి పోసి ఆలయాలలో నీటితో (శుద్ధి) పరిశుభ్రం చేశారు. యాదవ కులస్తులు ప్రతి ఇంటి నుండి ఒక పాత్రలో నీటిని తీసుకుపోయి ఆలయాలలోని విగ్రహాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ యాదవ సంఘం అధ్యక్షుడు బద్దుల రాజ్కుమార్యాదవ్, కౌన్సిలర్ మక్కపల్లి కుమారస్వామి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరేణి సమ్మయ్య, యాదవ సంఘం నాయకులు తొర్రి చిన్న సమ్మయ్య, భాషబోయిన సదానందం, భాషబోయిన ఓదెలు, గండ్రకోట రమేష్, గండ్రకోట సారయ్య, మక్కపెల్లి రమేష్, భాషబోయిన రాజకొమురయ్య, సింగరేణి రవి, తొర్రి అశోక్, జక్కుల రాజు, లెంకలపల్లి కుమార్, లెంకలపల్లి నవీన్, లెంకలపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.





