
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఈ నెల18వ తేదీ శనివారం రోజున హుజురాబాద్, జమ్మికుంట మునిసిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని హుజురాబాద్, జమ్మికుంట ట్రాన్స్ కో టౌన్ ఏఈలు శ్రీనివాస్ గౌడ్, జమ్మికుంట టౌన్ ఏఇ తెలిపారు.. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల దృష్ట్యా శనివారం ఉదయం 8 నుండి 11 గంటల వరకు హుజురాబాద్ పట్టణం బోర్నపల్లి కొత్తపల్లి తుమ్మన పల్లి ప్రాంతాలలో, జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మోత్కులగూడెం, మారుతి నగర్, హౌసింగ్ బోర్డ్, దుర్గా కాలనీ , అంబేద్కర్ కాలనీ, ఓల్డ్ మార్కెట్ ఏరియా, మసీదు ఏరియా, మాచినపల్లి, మోత్కులగూడెం, ఇండస్ట్రీస్ ఏరియా, కృష్ణ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీ, టీచర్స్ కాలనీ, న్యూ మార్కెట్ ఏరియా, మార్కెట్ ఏరియా, బస్టాండ్ ఏరియా తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, ప్రజలు సహకరించాలని వారు కోరారు.