Oplus_16908288
– ఐడీవోసీలో వాల్మీకి మహర్షి జయంతి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని.. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీఓసీ)లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, పలు సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..
వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మానవ జీవితానికి మార్గదర్శకమని, అందులోని నీతి, ధర్మం, సత్యం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




