Oplus_16908288
—అధికారుల నిర్లక్ష్యంపై గంగాడి కృష్ణారెడ్డి ఆగ్రహం – కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): వీణవంక మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులకు అధికారులు అందుబాటులో లేకపోవడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో, విధిలేని పరిస్థితుల్లో కార్యాలయంలోని అటెండర్, క్లర్క్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు, మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు సమయపాలన పాటించకుండా కార్యాలయాలకు హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై వినతిపత్రం సమర్పించేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులకు అధికారులు అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సమయపాలన పాటించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధులకు సమయానికి హాజరుకాని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు గంగాడి కృష్ణారెడ్డి హెచ్చరించారు. వీణవంక మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులకు తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నామాధవుని నరసింహరాజు, గుర్రాల వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగేశ్వర్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గొడుగు వినోద్ కుమార్, రామిడి ఆదిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, ఉడుత కుమార్, సర్పంచులు దాట్ల వీరస్వామి, శ్రీనివాస్, సంధ్య, సందీప్, కొలిపాక రజిత, శ్రీనివాస్, సారమ్మ, సారయ్య, ముత్యాల రవీందర్, దాసరి భాస్కర్, ఎంగటి శ్రీనివాస్, మారం తిరుపతి రెడ్డి, మండల కార్యదర్శి కర్రె నాని, బొంగుని ఎల్లగౌడ్, బొబ్బల శ్రీనివాస్ రెడ్డి, దామోదర్, అప్పని కొమురయ్య, కొలంగూరి రమేష్, కొలిపాక వెంకటేష్, అనిల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, వెంకటేశ్వర్లు, కుమార్, విజయ్, రమణారెడ్డి, సమ్మయ్య, కుమార్ రాజు, దేవాల రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ ఇల్లందుల సమ్మయ్య గారు, తొమ్మిదవ వార్డు కౌన్సిలర్, (ధమ్మక్కపేట) హుజురాబాద్ పురపాలక సంఘం.




