
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తన పట్టా భూమిలో ఇతరులు ఇంటి నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు కేవలం నోటీసు ఇచ్చారు తప్ప… చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు వాపోయింది. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో దమ్మక్కపేటలో తన స్థలంలో ఇతరులు నిర్మాణం చేస్తున్నారని అధికారులకు విన్నవించిన నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.


న్యాయస్థానం ఇంజంక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉన్న భూమిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం, దాన్ని అడ్డం పెట్టుకుని పక్కవారి స్థలంలోనూ నిర్మాణాలు చేపట్టడమేమిటనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ పేరుతో ఎలాంటి ఇంటి స్థలం లేకపోయినా ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం అధికారులు ఎలాంటి పరిశీలన చేయకుండా ఆమెకు ఇల్లు మంజూరు చేయడం, ఇతరుల స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం ఏమిటని అన్నారు. తనకు న్యాయం ఎప్పుడు చేస్తారని కమిషనర్ ను అడిగితే నోటీసులు ఇచ్చాం… ఇందిరమ్మ ఇల్లును కూల్చే అధికారం తమకు లేదంటూ సమాధానం ఇవ్వడం దారుణం అని బాధితురాలు అన్నారు. తప్పుడు పత్రాలతో ఇల్లు మంజూరు చేయించిన బాధ్యులపై విచారణ జరిపి, తక్షణమే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ మతి, శ్రీ ఎండి సమ్రీన్ గఫార్ గారు, 2వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హుజురాబాద్.




