
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు 101 వ జయంతి వేడుకలు మంగళవారం హుజూరాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు . పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలను తెలుగువాడి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన విధాన్ని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు రామగిరి అంకుస్, ఉపాధ్యక్షులు ఆలేటి రవీందర్, మండల అధ్యక్షులు వర్దినేని లింగారావు, ప్రతాప రాజు కామని రాజేశం, శివ కోటేశ్వరరావు,బత్తిని సంజీవ్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు