
-జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులుగా బుర్ర మల్లికార్జున్, శనిగరం కొమురయ్య
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పట్టణంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నిర్వాహకులు సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఆగ్రోస్ రైతు సేవ కేంద్ర సంఘ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సంఘం జిల్లా అధ్యక్షులుగా జమ్మికుంట పట్టణానికి చెందిన బుర్ర మల్లికార్జున్, అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా హుజురాబాద్ పట్టణానికి చెందిన శనిగరం కొమురయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ… ఆగ్రోస్ సేవా కేంద్రం నుండి రైతులకు తక్కువ ధరకే విత్తనాలను సరఫరా చేయడం ద్వారా రైతులకు తక్కువ ధరకు కొన్న విత్తనాలను పంటగా వేయడం ద్వారా అధిక దిగుబడిని పొందుతారని, అలాగే నకిలీ విత్తనాల కల్తీని అరికట్టవచ్చని వారు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇంకా వారికి సబ్సిడీ ద్వారా యూరియా, విత్తనాలతో పాటు, వ్యవసాయ పనిముట్లను అందించినట్లయితే రైతులకు అనేక లాభాలు కలుగుతాయని తెలిపారు. ఇకమీదట రైతులకు అన్ని రకాల పంటలు వేయడానికి వేరుశనగ, వడ్లు, పత్తి, మిర్చి, కందులు, పెసర్లు మొదలగు విత్తనాలను ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం నుండి పొందవచ్చునని తెలిపారు. ఈ సంఘం కార్యదర్శిగా మధుకర్ రెడ్డి చెల్పూర్ నుండి, కోశాధికారిగా బేతిగల్ కు చెందిన ప్రణయ్, కార్యవర్గ సభ్యులుగా కృష్ణమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన కమిటీ రైతులకు అందుబాటులో నుండి వారి అవసరాలను గుర్తించి తగిన సేవ చేస్తామని, అలాగే జిల్లాలోని అన్ని ఆగ్రోస్ రైతు సేవా కేంద్ర నిర్వాహకులను కలుపుకొని పోయి సేవలను కొనసాగిస్తామని తెలిపారు.
