తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం సి ఎస్ కు విజ్ఞప్తి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం జూన్ మూడవ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించదల్చటం సరికాదని, బడిబాట షెడ్యూల్ ను వెంటనే మార్చాలని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గురువారం తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం పక్షాన వినతి పత్రం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారిలకు ఫ్యాక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు తప్పకుండా విజయవంతం చేస్తారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ చెప్పారు. అయితే ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత ఉందనీ కనుక ఎండలు చాలా వేడిగా ఉన్నాయి కనుక జూన్ మూడో తేదీ నుండి కాకుండా జూన్ 12వ తేదీ నుండి బడిబాట నిర్వహించినట్లయితే చాలా బాగుంటుందని ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఎండాకాలం ఉష్ణోగ్రత 42 నుండి 45 వరకు ఉంటుందని, చిన్నపిల్లలు బడికి రావాలంటే ఎండను తట్టుకునే పరిస్థితిలో ఉండరు కనుక పిల్లలను దృష్టిలో పెట్టుకొని వారి కోసం అయినా జూన్ మూడో తేదీ నుండి బడిబాట వాయిదా వేసి జూన్ 12వ తేదీ నుండి బడిబాట నిర్వహించినట్లైతే చాల బాగుంటుందని ముజాహిద్ హుస్సేన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారిలకు పంపించిన ఆ రిప్రెసెంటేషన్లో కోరారు. మే నెల నుండి జూన్ 15వ తేదీ వరకు ప్రజలు ఇంటి నుండి బయటికి రావాలంటేనే భయం పడుతున్నారన్నారు. ఉష్ణోగ్రతను ఎండాకాలం అని తట్టుకోలేకపోతున్నారు కనుక ప్రజలను తల్లిదండ్రులను పిల్లలను దృష్టిలో పెట్టుకొని బడిబాట జూన్ 12వ తేదీ నుండి అయితే చాలా బాగుంటుందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు.