
-సినీ గేయ రచయిత గాయకుడు మురళి మధు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

మన దేశం కళలకు పుట్టిల్లని, మన కళా సాంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగించాలని సినీ గేయ రచయిత, గాయకుడు తెల్గం మురళీ మధు అన్నారు. ఆదివారం రాత్రి హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో కూచిపూడి నృత్య సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ ప్రాంతంలో అనేక కళలు వర్ధిల్లాలని, జానపద కళలతో పాటు కూచిపూడి నృత్యాన్ని మనం కొనసాగిస్తున్నామని తెలిపారు. కళలు మన జీవన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని అన్నారు. వేసవికాలంలో 30 రోజులపాటు 40 మంది బాలికలకు వరంగల్ కు చెందిన ఎన్ సిఎన్ కళాక్షేత్రం డాన్స్ మాస్టర్ కొంతo వెంకటేశ్వర్లు అభినందనీయుడని అన్నారు. ఈ సందర్భంగా 40 మంది బాలికలు తమ కూచిపూడి నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. తమ పిల్లల నృత్య కళా ప్రదర్శనలు వీక్షించడం పట్ల పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
