
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో గల ఎస్ఆర్కే డైరీలో కార్మికుడిగా పనిచేస్తున్న షేఖ్ ముజీజ్ (44) అనే కార్మికుడు ప్రమాదవశాత్తు ఈటీపీ ట్యాంకులో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నందిగామ గ్రామం, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు. గత 4 నెలలుగా వెంకటేశ్వర్లపల్లిలోని ఎస్ఆర్కే పాల డైరీలో టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నడని, సోమవారం విధులలో భాగంగా ఈటీపీ ట్యాంక్ ను చెక్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి ట్యాంక్ లో పడిపోగా గమనించిన తోటి కార్మికులు, సిబ్బంది జనరల్ మేనేజర్ మెచినేని మధు వెంటనే అతన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. మృతుని భార్య షేఖ్ కరీమా ఉంది. ఆమే ఇచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మికుంట సిఐ వరగంటి రవి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
