మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు కుర్బాని పేరుట ఆవులను వధ చేయరాదని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ అండ్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు కుర్బానీలో మేక, మేకపోతు దున్నపోతు ఎద్దు ఇలాంటి దాన్ని బలి ఇవ్వచ్చు కానీ ఎవరైనా పొరపాటున కూడా ఆవులను కొనటం, అమ్మటం చేసిన వారిపై పోలీస్ శాఖ కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుందని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్ ఈద్గా మరియు కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు బక్రీద్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం సోదరులందరికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ రోజు నమాజ్ ఈద్గాలలో చదువుకోవాలని, సరైన సమయం అందరూ ముస్లింలు పాటించాలన్నారు. వర్షాకాలం కనుక వర్షం వచ్చినట్లయితే మసీదులలో నమాజు చదువుకోవచ్చునని వర్షం లేనట్టు అయితే ఈద్గాలో సరైన సమయంలో నమాజు చదువుకోవచ్చు అని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
- Home
- బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు కుర్బానీ పేరిట ఆవులను వధించరాదు