
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో అంగరంగా వైభవంగా “చిరుతల రామాయాణ పట్టాభిషేకం” కార్యక్రమాన్ని హుజురాబాద్ టౌన్ సిఐ బొల్లం రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణ సిఐ బొల్లం రమేష్ మరియు ప్రముఖ న్యాయవాది TJS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర జన సమితి ముక్కెర రాజులు మాట్లాడుతూ ప్రాచీన కలలకు గ్రామీణ ప్రజలు ప్రాణం పోస్తున్నారని, అలాంటి వాటిలో చిరుతల రామాయణం ఒకటి అని అన్నారు. నాటి ఇతిహాసారైనా చిరుతల రామాయణం, భాగవతం లాంటి సాంస్కృతిక, సామాజిక అంశాలను స్పృశిస్తూ ఏర్పాటుచేసిన చిరుతల రామాయణాన్ని నాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రజలు అనుకరించడం, ప్రదర్శించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యంపిటిసి యాళ్ళ రాజేశ్వరరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ గూడూరి ప్రతాప్ రెడ్డి, ఉప సర్పంచ్ బేతి రాజిరెడ్డి, యాళ్ళ యతిశ్వరెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో చిరుతల రామాయాణ పాత్ర దారులు అందరూ పాల్గొని పట్టాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా ప్రారంభించగా ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
