
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా శుక్రవారం హుజురాబాద్ పట్టణానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కి బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయనకు మంగళహారతులతో మహిళ కార్యకర్తలు స్వాగతం పలకగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఆయనకు గజమాల వేసి, శాలువాలు కప్పడానికి బొకేలు ఇవ్వడానికి పోటీలు పడ్డారు. అందరితో ఫోటోలు దిగిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ నీ పలువురు ఘనంగా సత్కరించారు. టపాకాయలు కాల్చి వేడుకలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, హుజురాబాద్ పట్టణ నాయకులతోపాటు నియోజకవర్గంలోని పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

