
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ సిద్ధాంతక ర్త ప్రొఫెసర్ జయశంకర్ 13వ వర్ధంతి వేడుకలు శుక్రవారం హుజురాబాద్ లో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వర్ణకార సంఘం, బులియన్ మర్చంట్, విశ్వబ్రాహ్మణ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జయశంకర్ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తొవిటి సదానందచారి, కాసుల కిరణ్ కుమార్, కట్ట భాస్కరచారి, కొండపాక నరసింహాచారి, గుగ్గిళ్ళ రాజు, మునిగంటి నాగరాజు, పొన్నోజు సుధాకర్, కందుకూరి విశ్వప్రసాద్, రత్నాచారి, శ్రీరామోజు సత్యనారాయణ, విజయగిరి శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే హుజురాబాద్లో ని ఈటెల కాంప్లెక్స్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చల్లూరి రఘుచారి మాట్లాడుతూ.. న్యూ ఈటెల రాజేందర్ కాంప్లెక్స్ దగ్గర కరెంట్ ఆఫీస్ ముందు చౌరస్తాను ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాగా మార్చాలని కోరారు. అలాగే విశ్వకర్మలను బీసీ-బీ నుంచి బీసీ-ఏలకు మార్చాలన్నారు. 50 ఏళ్లు దాటిన విశ్వకర్మలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

