
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: 2024- 25వ విద్యా సంవత్సరంలో క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 24, 25 వ తేదీలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు హుజురాబాద్ మండల విద్యాధికారి కేతిరి వెంకట నరసింహారెడ్డి, ఎస్ జిఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సొల్లు సారయ్యలు తెలిపారు. ప్రవేశం కోసం గత ఏడాది మూడవ తరగతి పరీక్ష పాస్ అయి ఉండాలని, అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎమ్మార్సీలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులైన విద్యార్థులు స్టడీ, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, ఇతర ధ్రువపత్రాలను వెంట తీసుకొని రావాలని తెలిపారు.






