
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా యోగా డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రిటైర్డ్ పి ఈ ట కొన్ని రాజిరెడ్డి వాకర్స్ తో యోగా చేయించి యోగ వల్ల ఉన్న ప్రయోజనాలను వివరించారు . మనిషి ఆరోగ్యంగా ఉండడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుందనీ వివరించారు. అలాగే యోగా దినోత్సవం సందర్భంగా గర్ల్స్ హై స్కూల్ హుజురాబాద్ విద్యార్థులకు యోగా యోగా టీచర్ కొటోజు జ్యోతిరాణి విద్యార్థుల యోగ నేర్పించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు కొన్ని రాజిరెడ్డి, సొల్లు సారయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు ముక్క రమేష్, వెంకట్ రెడ్డి, ముత్యంరాజు, వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి మొబిన్, ప్రభాకర్, వేల్పుల రత్నం, పాక సతీష్, వెంకట్రాజ్యం, శ్రీనివాస్, మునీరుద్దీన్, విద్యానంద్, ప్రకాష్, రాజిరెడ్డి, సలీం, రాజలింగం, రాజు, దశరథం, ప్రభాకర్ రెడ్డి, రవీందర్, ప్రతాప రమేష్, మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు.

