
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి,హుజూరాబాద్, జూన్ 21 : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వామ్యం కావాలని కౌ ఫౌండేషన్ చైర్మన్, సామాజిక వేత్త కాశెట్టి కుమార్, విశ్వహిందు పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కళ్ళెపు సుధాకర్ రావులు కోరారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ‘మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన అనంతరం అనంతరం కాశెట్టి కుమార్, కళ్ళెపు సుధాకర్ లు మాట్లాడుతూ…. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మొక్కలు నాటి చెట్లను పెంచితేనే వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని, పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి లభిస్తుందని దీంతో ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. భవిష్యత్ తరాలకు పచ్చదనం. స్వచ్చమైన వాతావరణం అందించిన వాళ్ళమవుతామని వారన్నారు. మానవ జాతికి మొక్కలే ఆధారమన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. మొక్కలు నాటి చెట్లను పెంచాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని. పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో కృషి చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్న సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బండి శేషయ్య, కొమురవెళ్ళి సదానందం, కళ్ళెపు రేణుక, రాజు, భీమోజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.






