
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం హుజురాబాద్ కు వచ్చిన సందర్భంలో అంబేద్కర్ చౌరస్తాలో జేబు దొంగలు హల్ చల్ సృష్టించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ వచ్చిన సంబరాలో మునిగితే తేలగా జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అక్కడికి వచ్చిన బిజెపి నాయకులు కార్యకర్తల జేబులకు చిల్లులు పెట్టి ఉన్నదంతా ఊడ్చు కెల్లారు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 10, 15 మంది జేబుల్లో ఉన్న డబ్బులను గుట్టు చప్పుడు కాకుండా దొంగలించారు. బండి సంజయ్ పోయిన తర్వాత కొద్ది సేపటికి జేబులో డబ్బులు చూసుకోగా జేబు దొంగలు చోరీ చేసిన విషయం గ్రహించారు. వెంటనే పలువురు బాధితులు హుజురాబాద్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం అని వెళ్ళగా పోలీసు స్టేషన్ లో సీసీ కెమెరాలు కేబ్లెలు కోతులు ధ్వంసం చేయడంతో పని చేయడం లేదని పోలీసులు సమాధానం చెప్పడముతో బాధితులు లబోదిబో మంటున్నారు. ఈ జేబు దొంగలు సుమారు లక్షకు పైగా డబ్బులు కాజేసినట్లు పట్టణంలో ప్రచారం గుప్పు మంటుంది. అయితే చౌరస్తాలో సీసీ కెమెరాలు పనిచేయవని తెలుసుకున్న వారే ఈ జేబు దొంగతనాలకు పాల్పడి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా నిత్యం ఎంతో రద్దీగా ఉండే అంబేద్కర్ చౌరస్తాలో ఎంతో ఇంపార్టెంట్‌గా ఉండాల్సిన సీసీ కెమెరాలు పనిచేయకుండా మారడం, వాటిని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది.
